IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 26 వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి స్టేడియం వేదికగా 7: 30 pm కి ప్రారంభం కానుంది.

అయితే లక్నో వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. అటు ఢిల్లీ మాత్రం పాయింట్స్ టేబుల్ లో చివరన ఉండిపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. కేవలం సీఎస్కే జట్టు పైన విజయం సాధించింది ఢిల్లీ. ఇకపై ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.

లక్నో ప్లేయింగ్ ఎలెవన్ : డికాక్, KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్ : పృథ్వీ షా, వార్నర్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, మెక్గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news