ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కోల్కతా ఓపెనెర్లలో ఫిలిప్స్ సాల్ట్ 14 బంతుల్లో 32 పరుగులు చేయగా, మరో ఓపెనర్ సునీల్ నరేన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
39 బంతుల్లో 7 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రఘువంశీ 32, రస్సెల్ 12, రింకూ సింగ్ 16, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. ఇక చివర్లో కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రమణ్ దీప్ 25* పరుగులు చేయడంతో కోల్కతా భారీ స్కోరు సాధించింది.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.