IPL 2024 షెడ్యూల్ ఫిక్స్.. ఆందోళనలో BCCI

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్. ఐపీఎల్ 17వ సీజన్ కి సంబంధించి షెడ్యూల్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. 2024 మార్చి 22న ఐపీఎల్ ప్రారంభించడానికి బీసీసీఐ ముహూర్తాన్ని పెట్టేసింది. మే 26న ఫైనల్ జరిగే విధంగా షెడ్యూల్ ని రూపొందించింది. త్వరలోనే షెడ్యూల్ ని అధికారిక ప్రకటన చేయబోతోంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడం వలన ఎలక్షన్స్ డేట్ వచ్చాకే ఐపీఎల్ 2024 షెడ్యూల్ ని వెల్లడించాలని బీసీసీఐ భావిస్తుంది.

ఐపీఎల్ 2024 ని విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలు కూడా తెగ షికార్లు కొడుతున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఇండియాలోనే జరిగే విధంగా చూస్తోంది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ మ్యాచ్ లని మరొక చోటకి మార్చే ఆలోచన లో ఉంది బిసిసిఐ జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో కొన్ని టాప్ జట్లకి మ్యాచ్లు ఉన్నాయి జూన్ 1 నుండి ఇది జరగబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news