IPL 2024: హైదరాబాద్‌లో సన్ రైజర్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే

-

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2024 సీజన్ 17 కు సంబంధించిన మొదటి విడత షెడ్యూల్‌లో కేవలం 21 మ్యాచులకు మాత్రమే తేదీలను ప్రకటించారు. తాజాగా బీసీసీఐ సోమవారం సాయంత్రం ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే… మన హైదరాబాద్ లో సన్ రైజర్స్ ఆడే మ్యాచుల తేదీల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో హైదరాబాద్ లో రెండు మ్యాచుల తేదీలను ప్రకటించగా తాజాగా విడుదల చేసిన పూర్తి షెడ్యూల్‌లో మొత్తం ఏడు మ్యాచులు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి మ్యాచ్ ఈ నెల 27 ముంబై ఇండియన్స్ తో జరగనుండగా హోమ్ గ్రౌండ్ లో చివరి ఏడో మ్యాచ్ మే 17న జరగనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచులు

హైదరాబాద్ vs ముంబై, మార్చి 27 (ఉప్పల్)

హైదరాబాద్ vs చెన్నై, ఏప్రిల్ 5, (ఉప్పల్)

హైదరాబాద్ vs ఆర్సీబీ, ఏప్రిల్ 25 (ఉప్పల్)

హైదరాబాద్ vs రాజస్థాన్, మే 2 (ఉప్పల్)

హైదరాబాద్ vs లక్నో, మే 8(ఉప్పల్)

హైదరాబాద్ vs గుజరాత్, మే 16 (ఉప్పల్)

హైదరాబాద్ vs పంజాబ్ ,మే 19 (ఉప్పల్)

Read more RELATED
Recommended to you

Latest news