మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ… ఫోటోలు వైరల్

-

దేశ వ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు . చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా హోలీ సెలబ్రేషన్స్ జరిగాయి.

సినీ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు కూడా గ్రాండ్‌గా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ముఖ్యంగా మనువడి రియాన్స్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. మనువడికి రంగు పూస్తూ ఎంతో ఆనందంగా ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మనవడితో కలిసి రేవంత్ రెడ్డి సరదాగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లా వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news