IPL 2024: రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు టీం లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒకే వేదికలో 3000+ రన్స్ చేసిన తొలి ప్లేయర్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాల్టి మ్యాచ్లో విరాట్ ఈ ఘనతను అందుకున్నారు. 3005 పరుగులతో కోహ్లి టాప్లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(వాంఖడే-2295), డివిలియర్స్ (1960-చినస్వామి) ఉన్నారు.కాగా, ఒకవేళ ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయిన లేకపోతే ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news