IPL 2024 : ‘ఏంటి బ్రో.. సొంత జట్టుకు సపోర్ట్ చేయరా?’

-

కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతున్నా.. ఎక్కువగా ఎల్లో జెర్సీలే కనిపిస్తున్నాయి. మెట్రో రైళ్లు పసుపు రంగు జెర్సీలతో నిండిపోయాయి. ధోనీపై అభిమానంతో తెలుగు ప్రేక్షకులు చెన్నైకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఇది హైదరాబాదేనా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘ఎంతైనా సొంత జట్టుకు సపోర్ట్ చేయకపోవడమేంటి బ్రో’ అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. మొదటి క్లాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ జట్టుకు మంచి రిజల్ట్ లేదు. ప్రతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్లేయర్లు ఎలా ఆడతారు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news