ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఐపిఎల్ ని ఈ ఏడాది రద్దు చేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత రెండు మూడు నెలలుగా ప్రపంచాన్ని కరోన మహమ్మారి భయపెడుతుంది. ఊహించని విధంగా ఈ వైరస్ ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది. ఒక్క ఆఫ్రికా ఖండం మినహా దాదాపు అన్ని ఖండాలు కూడా ఈ వైరస్ దెబ్బకు చిగురుటాకుల్లా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచ వ్యాప్తంగా దీని బాధితుల సంఖ్య లక్ష పైనే ఉంది. దాదాపు నాలుగు వేల ,మంది ఈ వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. ఇక గత నాలుగు రోజుల నుంచి మన దేశాన్ని కూడా కరోనా వైరస్ ఇబ్బంది పెడుతుంది. మన దేశంలో 31 మందికి వైరస్ రాగా అందులో ముగ్గురికి వ్యాధిని నయం చేసారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశంలో ఐపిఎల్ ని కరోనా దెబ్బకు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు అంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఐపియల్ నిర్వాహకులకు చెప్పినట్టు సమాచారం. వేలాది మంది అభిమానులు మ్యాచులు చూడటానికి వస్తూ ఉంటారు. అందులో విదేశాల నుంచి కూడా వచ్చే వారు ఉంటారు. ఈ నెల 29 నుంచి ఈ టోర్నీ మొదలుకానుంది. కాబట్టి ఏదైనా జరిగింది అంటే మాత్రం నరకం చూడాలి ప్రజలు అందరూ. అందుకే రద్దు చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం రద్దు చేసే అవకాశం లేదని అంటున్నారు.