ఢిల్లీ మరియు గుజరాత్ టీం ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఏ ఒక్క విషయం లోనూ కలిసిరాలేదని చెప్పాలి. మొదటి బంతికే సాల్ట్ వికెట్ ను కోల్పోయిన ఢిల్లీ అప్పటి నుండి పవర్ ప్లే ముగిసే వరకు కోలుకోలేకపోయింది. పవర్ ప్లే లో ఈ సీజన్ లోనే వరెస్ట్ గా అయిదు వికెట్లు కోల్పోయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. షమీ చెలరేగి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మరియు అమన్ హకీమ్ ఖాన్ లు 6వ వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఏడవ వికెట్ కు హకీమ్ ఖాన్ మరియు రిప్పల్ పటేల్ లు 53 పరుగులు చేసి ఢిల్లీ పరువును కాస్త అయినా కాపాడుకున్నారు.