పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా రెండు నెలల కిందట జపాన్‌లోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్టులో 25 గ్రాముల కొకైన్ తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వివాదాలు ఏమీ కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సీజన్ ఆరంభంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ చేసిన మన్కడింగ్‌తో వివాదం రాజుకుంది. సోషల్ మీడియా అశ్విన్‌ను ఏకి పారేసింది. అయితే ఆ జట్టుకు ఇప్పుడు మరో కొత్త కష్టం ఎదురు కానుంది. అదే.. నిషేధం..! ఐపీఎల్ యాజమాన్యం పంజాబ్ జట్టును నిషేధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే.. ఆ జట్టు సహ యజమాని నెస్ వాడియా డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు కనుక..!
పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా రెండు నెలల కిందట జపాన్‌లోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్టులో 25 గ్రాముల కొకైన్ తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే విచారణల అనంతరం అతను చేసిన నేరం రుజువు కావడంతో జపాన్ న్యాయస్థానం నెస్‌వాడియాకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఐపీఎల్‌లో ఏ జట్టుకు చెందిన ప్లేయర్ అయినా, జట్టుతో సంబంధం ఉన్న వ్యక్తులు అయినా, లేదా జట్టు యజమానులు అయినా సరే.. నేరం చేసినా, నేరం కింద అరెస్టు కాబడి జైలు శిక్ష పడినా.. ఆ జట్టును ఐపీఎల్ నియమావళి ప్రకారం నిషేధిస్తారు.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు చెందిన యజమానులు, ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం విధించారు. దీంతో ఈ జట్లు 2016, 2017 సీజన్లలో ఐపీఎల్ ఆడలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా కూడా అరెస్టై జైల్లో శిక్షననుభవిస్తున్న నేఫథ్యంలో ఆ జట్టు నిషేధంపై ఇవాళ నిర్ణయం తీసుకోన్నారు. అయితే ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు అయిపోయిన నేపథ్యంలో ఇకపై పంజాబ్ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధిస్తారా..? లేదంటే ఈ సీజన్‌ను విడిచిపెట్టి వచ్చే ఒకటి లేదా రెండు సీజన్లలో పంజాబ్ జట్టును బ్యాన్ చేస్తారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!