ఐపీఎల్: సన్ రైజర్స్ ముంగిట భారీ లక్ష్యం…!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌,‌ మార్కస్‌ స్టోయినీస్‌ అదరగొట్టారు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసి.. సన్‌రైజర్స్‌ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 78 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులతో అర్ధ శతకం సాధించాడు. 2020 సీజన్‌లో ధావన్‌కిది ఆరో హాఫ్‌సెంచరీ. మరో ఓపెనర్ మార్కస్ స్టోయినిస్ 38 , షిమ్రాన్ హెట్‌మెయర్ 42 రాణించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఇప్పటివరకు ఆకట్టుకున్న హోల్డర్ ఈ మ్యాచులో 50 పరుగులు ఇచ్చుకున్నాడు.