ఇండియాలో ఐపీఎల్ సీజన్ 17 నిర్వహణ కష్టమే కాదు … అసాధ్యం !

-

ఇండియా ప్రీమియర్ లీగ్ ఇండియాలో ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 17 మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యన బీసీసీఐ అధికారి తెలిపిన ప్రకారం, ప్రస్తుతం వీరి దృష్టి అంతా కూడా అక్టోబర్ లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ నిర్వహణ మీద ఉందని తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఐపీఎల్ గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ క్రికెట్ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఐపీఎల్ జరిగే సమయానికి ఇండియాలో లోక్ సభ ఎన్నికలు దశల వారీగా దేశమంతా జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ జరిపించడానికి అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. దీని కారణంగా ఇండియాలో అయితే ఐపీఎల్ నిర్వహించే ప్రసక్తే లేదని క్లియర్ గా తెలుస్తోంది.

దీనితో ఐపీఎల్ సీజన్ 17 ను శ్రీలంక లో లేదా యూఏఈ లో జరిపించడానికి ప్లాన్ చేయాల్సిందే అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. మరి చివరికి ఏ దేశంలో ఐపీఎల్ ను నిర్వహిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news