ఈ రోజు వెస్ట్ ఇండీస్ ఇండియా ఆడుతున్న మూడవ వన్ డే లో గత మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ ను ఇద్దరినీ తీసివేసి ఋతురాజ్ గైక్వాడ్ కు మరియు బౌలర్ జయదేవ్ ఉనద్కట్ లకు అవకాశం ఇచ్చింది. కాగా ఋతురాజ్ ఎలాగు యంగ్ క్రికెటర్ .. కానీ జయదేవ్ ఉనద్కట్ మాత్రం సీనియర్ ప్లేయర్ అని చెప్పాలి. ఎప్పుడో ఇండియా తరపున అరంగేట్రం చేసిన ఉనద్కట్ నిలకడ అయిన ప్రదర్శన చేయడంలో విఫలం అయ్యి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే ఈ రోజు ఆడుతున్న వన్ డే మాత్రమే లాంగ్ రి ఎంట్రీ అని చెప్పాలి. ఉనద్కట్ లాస్ట్ వన్ డే మ్యాచ్ ఆడింది 2013 నవంబర్ లో వెస్ట్ ఇండీస్ తోనే ఆడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే జట్టుతో పది సంవత్సరాల తర్వాత ఆడుతున్నాడు. ఉనద్కట్ 3539 రోజుల సుదీర్ఘ సమయం అనంతరం వన్ డే ఆడుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఇతను కేవలం 7 వన్ డే లు మాత్రమే ఆడగా… ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు.
మరి ఈ మ్యాచ్ లో ఉనద్కట్ సెలెక్టర్ లు తనపైన పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తాడా అన్నది తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు చూడాల్సిందే.