ఇరాన్ కు అమెరికా అన్నా అమెరికా అద్యక్షుడు డోనాల్ ట్రంప్ అన్నా అస్సలు గిట్టదు..! తమ ఆర్మీ అధ్యక్షుడు ఖాసిం సులేమాని ని అమెరికా సైన్యం బాగ్దాద్ అయిర్పోర్ట్ వద్ద డ్రోన్ లతో హతమార్చిన సంగతి తెలిసిందే ఇక అప్పటినుండి వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పగ తీర్చుకోవాలని పడింది. ఎలాగైనా ట్రంప్ ని అరెస్ట్ చేయాలని వారు భావిస్తున్నారు. గతంలో కూడా సులేమాని ని హతమార్చిన తరువాత ట్రంప్ తలను తెస్తే 80,000 అమెరికన్ డాలర్లు ఇస్తామని చేసిన వ్యాఖ్య కూడా తెలిసిందే. ఇక ఇదే నేపద్యం లో ఇరాన్ మరో దుస్సాహసానికి తెగబడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ను కోరింది. కనీసం రెడ్ నోటీసునైనా జారీ చేయాలని విన్నవించింది. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు ఇంటర్ పోల్ చీఫ్ లియోన్ నిరాకరించారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ట్రంప్ సహా మరో 30 మంది పై సులేమాని విషయంలో హత్య, ఉగ్రవాద అభియోగాలను మోపినట్టు సమాచారం. ట్రంప్ పదవి కాలం ముగియగానే అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.. చూడాలి మరి ఈ ఘటన పై అమెరికా ఎలా స్పందిస్తుందో.
అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ అరెస్ట్ వారంట్..! మరి ట్రంప్ ఏమంటాడో..?
-