IRCTC: ఈ ఒకరోజు టూర్ ప్యాకేజీ వివరాలని శ్రీవారి భక్తులు చూడాల్సిందే..!

-

తిరుపతి వెళ్లాలని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఒకరోజు తిరుపతి టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. మరి వివరాలని పూర్తిగా చూస్తే… డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇది ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే గమనించండి. వసతి సౌకర్యాలు ఉండవు. టూర్ వివరాలని చూస్తే… ధర రూ.990 మాత్రమే.

ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర టూర్ మొదలవుతుంది. అయితే ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారిని 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుంటారు ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు. 8.30 గంటలకు తిరుమలకు బయల్దేరతారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శనం చేసుకున్నాక… భోజనం సొంత ఖర్చుతోనే చేయాలి. ఆ తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మ వారిని దర్శించుకోవడానికి బయల్దేరతారు.

తిరుమలలో ఆలస్యం అయితే భక్తులను తిరుచానూర్‌ తీసుకెళ్లరు. ఇది అయ్యాక మళ్లీ రైల్వే స్టేషన్‌లో భక్తులను డ్రాప్ చేస్తారు. ఇదే టూర్ ప్యాకేజీ. ఒక్కరోజులో తిరుపతి చూసి వచ్చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్యాకేజీ బెస్ట్. ప్యాకేజీలో ఏసీ బస్సులో ప్రయాణం, తిరుమల, తిరుచానూర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. భక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. ఐడీ కార్డు లేకపోతే టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించరు.

Read more RELATED
Recommended to you

Latest news