కడప జిల్లా తుమ్మలపల్లిలో హై టెన్షన్.. ఆరో సారి రీ కౌంటింగ్ !

-

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే..ఎన్నికల కౌంటింగ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో అన్ని చోట్లా కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే కడప జిల్లా వీ కోడూరు మండలం తుమ్మల పల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఎందుకంటే ఇక్కడ కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.

ఇప్పటికి ఐదు సార్లు ఓట్లు లెక్కించారు..అయితే ఒకసారి టిడిపి ఒకసారి వైసిపి అని అధికారులు చెబుతుండడంతో మళ్లీ మళ్లీ రీకౌంటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు ఆందోళన నేపథ్యంలో ఆరో సారి రీ కౌంటింగ్ కి అధికారులు సిద్ధమవుతున్నారు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది..ఇప్పటికే దాదాపుగా వైసీపీ తన హవా చూపిస్తుంటే టీడీపీ కూడా చెప్పుకోదగ్గ స్థానాలు కైవసం చేసుకుని తమ సత్తా నిలుపుకుంది అని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ కూడా ఒక సర్పంచ్ పదవి గెలుచుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news