ఏప్రిల్ 30 వరకు రైళ్ళు రద్దు…!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30 వరకు ప్రైవేట్ రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. వారణాసి-ఇండోర్ రూట్‌లో కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్, లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐఆర్‌సీటీసీ నడుపుతు౦ది. లాక్‌డౌన్ కారణంగా ఈ మూడు రైళ్లను ఏప్రిల్ 15 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 30 వరకు ఈ మూడు ప్రైవేట్ రైళ్లను నడపొద్దని భావించింది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో రైళ్ళను నడిపిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశాలు ఉంటాయనిపలువురు హెచ్చరిస్తున్నారు. ఈ రైళ్లలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తామని, ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ఉన్న నేపధ్యంలో ఇండియన్ రైల్వే ప్యాసింజెర్ రైళ్ళను రద్దు చేసింది.

ప్రజల అవసరాల మేరకు గూడ్స్ రైళ్ళు మాత్రం నడుస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిస్తే ఏప్రిల్ 15 నుంచి ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని… రైళ్లు ప్రారంభమైన తర్వాత రైల్వే స్టేషన్లలో, రైళ్లల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని అదే విధంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల్ని భారీగా పెంచడం ద్వారా రైల్వే స్టేషన్‌లో రద్దీ తగ్గించే ఆలోచనలో కూడా రైల్వే శాఖ ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version