ఇంగ్లాండ్ VS ఐర్లాండ్: ఇన్నింగ్స్ ఓటమి నుండి సేఫ్ అయిన ఐర్లాండ్…

-

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం ఖాయం అయిపోయింది. కానీ ఇన్నింగ్స్ విజయం సాధిస్తుంది అని కంఫర్మ్ గా అనిపించినా… ఇప్పుడు తలక్రిందులు అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ బ్రాడ్ దెబ్బకు కేవలం 172 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 524 పరుగులు చేసి ఐర్లాండ్ ముందు బలమైన ట్రయిల్ స్కోర్ ను ఉంచింది. కానీ ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సమర్థవంతంగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు సహనాన్ని పెడుతోంది. ప్రస్తుతం ఐర్లాండ్ 356 పరుగులు చేసి ఇంకా ఆడుతోంది, చేతిలో ఇంకా 2 వికెట్లు ఉండగా తన లీడ్ ను ఎంతవరకు పెంచుకుంటుంది అన్నది చూడాలి.

 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయాన్ని అడ్డుకున్నది మాత్రం… టక్కర్, మేక్ బ్రిన్ , మార్క్ అడైర్ లు అని చెప్పాలి. ఇంగ్లాండ్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని ఐర్లాండ్ ను ఇన్నింగ్స్ ఓటమి నుండి తప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news