ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం ఖాయం అయిపోయింది. కానీ ఇన్నింగ్స్ విజయం సాధిస్తుంది అని కంఫర్మ్ గా అనిపించినా… ఇప్పుడు తలక్రిందులు అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ బ్రాడ్ దెబ్బకు కేవలం 172 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 524 పరుగులు చేసి ఐర్లాండ్ ముందు బలమైన ట్రయిల్ స్కోర్ ను ఉంచింది. కానీ ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సమర్థవంతంగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు సహనాన్ని పెడుతోంది. ప్రస్తుతం ఐర్లాండ్ 356 పరుగులు చేసి ఇంకా ఆడుతోంది, చేతిలో ఇంకా 2 వికెట్లు ఉండగా తన లీడ్ ను ఎంతవరకు పెంచుకుంటుంది అన్నది చూడాలి.