ఆ ఇద్దరు దిగ్గజాల కలయికే రోహిత్ శర్మ..!

ఐపీఎల్ 2020 సీజన్ లో ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 5 వసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుని ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రస్తుతం ఎంతో మంది మాజీలు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇటీవలే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ రోహిత్ శర్మ కెప్టెన్సీపై హర్షం వ్యక్తం చేశాడు.

అంతేకాదు భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్ గా ఉన్న సౌరవ్ గంగూలీ ఎంఎస్ ధోని లక్షణాలను కలిపితే కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ప్రశంసించాడు. దాదా తన బౌలర్లను నమ్ముకునే ముందుకు సాగుతాడు అని ధోనీ సైతం బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడని రోహిత్ శర్మ కూడా బౌలర్లపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ వ్యూహాలు కూడా దాదా ధోని లాగే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.