అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

-

సాధారణంగా మహిళలు అందరికి ఒక సమస్య తీవ్రంగా ఉంటుంది. అది ఏంటీ అంటే, ప్రసవం తర్వాత క్రమంగా నడుము, పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. దీనిని తొలగించుకోవడానికి మహిళలు నానా ఇబ్బందులు పడతారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు అయితే ఏమీ కాదు గాని, ఆఫీసులకు వెళ్ళే మహిళలకు అయితే మాత్రం ఈ సమస్య కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

దీనితో వాళ్ళు స్వేచ్చగా డ్రెస్ లు వేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని కరిగించడం కోసం తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం.

మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. మళ్ళీ ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్, 3 సెట్లు చెయ్యాల్సి ఉంటుంది.

నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత వెనక్కి చాచాలి. ఇలాగే రెండో కాలితో కూడా చేయాలి. ఒక్కో కాలితో 20 రిపిటీషన్స్‌, 3 సెట్లు చేయాలి. దీనితో మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news