ఏపీ బీజేపీకి పెను చిక్కే వచ్చిపడింది. మరికొద్ది రోజుల్లోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగ నుంది. అయితే.. ఈ విషయంలో ఏకపక్షంగా ముందుకు సాగాలని అనుకున్నా.. జగన్ ట్రాప్‌లో చిక్కుకున్న నాయకులు కలిసి వస్తారా? అనేది పెద్ద వివాదంగా మారింది. స్థానికంగానే కాకుండా.. రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ నేతలకు జగన్ సర్కారు చాలా కాంట్రాక్టులను కట్టబెట్టిందనే విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చెప్పిన వారికి జగన్ అంతో ఇంతో మేలు చేశారు. దీంతో ఇప్పుడు వారంతా ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా జగన్‌కు అనుకూలంగా ఉన్నారు.
దీంతో తిరుపతి ఉప పోరులో తమకు నిధులు కావాలన్నా.. ఇతరత్రా సాయం కావాలన్నా.. వారు చేయగల రా? అనేది బీజేపీ నేతల ఆవేదన. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం కూడా జగన్ సర్కారుపై ఒ క్కమాట కూడా అనలేదు. రేపు తిరుపతి ఉప ఎన్నికలో కేంద్రం నుంచి పెద్దలు వచ్చే విషయంపైనా ఇంకా స్పష్టత లేదు. దీనికి కారణం.. కేంద్రంలో బీజేపీ-జగన్‌లకు మధ్య మంచి రెపో ఉండడమేనని అంటున్నా రు. ఇంకోవైపు.. స్థానికంగా కూడా బీజేపీ నాయకుల్లో రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి జగన్‌కు అనుకూల వర్గం.. జగన్‌కు వ్యతిరేక వర్గం.
రాజధాని ప్రాంతాలైన గుంటూరు కృష్ణాజిల్లా బీజేపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా ఉండగా.. సీమ, ఉత్తరాం ధ్ర నేతలు జగన్ కు అనుకూలంగా ఉన్నారు. దీంతో వీరు కూడా తిరుపతి ఉప ఎన్నికలో జగన్‌కు వ్యతిరేకం గా పావులు కదిపే అవకాశం లేదు. సాక్షాత్తూ సోము వీర్రాజు కూడా జగన్ బ్యాచ్‌గానే ముద్ర వేసుకున్నారు. అధిష్టానం చెబితేనే తప్ప.. ఆయన జగన్‌పై పన్నెత్తు మాట అనడం లేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ ట్రాప్‌లో చిక్కుకున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అనగానే తల్లడిల్లుతున్నారు. ఎవరిలోనూ పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సీమ ప్రాంతం వారిలో ఈ దూకుడు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు తిరుపతిలో గట్టెక్కడం ఎలా ? అనే విషయంలో బీజేపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారని అంటున్నారు పరిశీలకులు.