టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తర్వాత కాలంలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా మామకు తగ్గ అల్లుడుగా నిరూపించుకున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే చాలా కాలం కొనసాగాలి అంటే కేవలం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు. ఇక అందుకు తగ్గట్టుగా ప్రతిభ నటన ఉంటూనే ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. ఇప్పటికే చాలా మంది హీరోలు సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొంతమంది తమ నటనను నిరూపించుకుంటూ హీరోలుగా చలామణి అవుతుంటే .. మరికొంతమంది 1, 2 సినిమాలకే ఫేడ్ అవుట్ అవుతూ వస్తున్నారు.
ఇక బైక్ స్కిడ్ అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన లేకపోయాడు. దీంతో మెగా హీరోలు అందరూ ముందుకు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ వేదికను పొలిటికల్ వేదికగా మార్చుకొని.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తన ప్రతీకారాన్ని చూపించాడు. కానీ ఈ విషయంపై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఇక ఈ ఎఫెక్టు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాపై పడి సినిమా విడుదలైన వెంటనే పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది . ఏ ఒక్కరు కూడా సినిమా చూడడానికి వెళ్ళలేదు. అలా ఇప్పుడు ఆయన సినిమా తీస్తున్నా..ఆ ప్రభావం ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్ నాశనం అవ్వడానికి ఆయన మేనమామ పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.