బుర్రకో బుద్ది, జిహ్వాకో రుచి అన్నట్లు కొందరి ఆలోచనలు కొత్త ఆవిష్కరణలకు పునాదులుగా మారుతుంటే.. కొన్ని సందర్భాల్లో అలా చేసిన వారి జీవితాలే కనుమరుగైపోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనే ఉంది. మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ (19) చెన్నైలోని తరమణిలో ఉన్న లా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఊరికి వెళ్లొచ్చిన సల్మాన్ అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న సల్మాన్.. స్నేహితులతోనూ సరిగా మాట్లాడడం లేదు.
తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సల్మాన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అతడు.. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు సల్మాన్. తాను దాచిపెట్టిన రూ. 5 వేల నగదును అమ్మకు అప్పగించాలని అందులో సల్మాన్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు ఇంకేమైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈ విషయం తెలియడంతో సల్మాన్ తల్లి గుండెలు అవిసేలా విలపిస్తోంది.