మంత్రి మ‌ల్లారెడ్డి మాట‌ల‌తో రేవంత్‌కు ప్ల‌స్ అవుతోందా…

-

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేయడం ప్రారంభించాడు. ఇకపోతే కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో ఐక్యత తీసుకొచ్చేందుకుగాను రేవంత్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలను నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజా సమస్యలపై నేతలు దృష్టి సారించాలని సూచిస్తూనే తాను తెలంగాణ అంతటా తిరగాలనుకుంటున్నాడు. అందులో భాగంగా రేవంత్ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో దీక్ష చేశాడు. త్వరలో గజ్వెల్‌లో సమావేశమవుతామని తెలిపారు.

అధికార గులాబీ పార్టీపై పోటీని కఠినతరం చేసేందుకుగాను ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను అంబేద్క‌ర్ బ‌హుజ‌న భ‌వ‌న్‌గా మార్చి, ద‌ళిత, గిరిజ‌న‌, బ‌హుజ‌న బిడ్డ‌ల కోసం బ‌డ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని రేవంత్ పేర్కొంటున్నారు. తెలంగాణ‌లోని పిల్ల‌ల‌ను ఐఏఎస్, ఐపీఎస్‌, డాక్ట‌ర్లు, ఇంజినీర్లుగా మారుస్తామని చెప్తున్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని చూస్తే టీఆర్ఎస్ భయపడిపోతుందని రేవంత్ అంటున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చలేదు. అయితే, మంత్రి మ‌ల్లారెడ్డి మాత్రం రేవంత్‌పై విరుచుకుపడుతున్నారు. తొడగొట్టిమరి చాలెంజ్‌లు విసురుతున్నాడు.

మొత్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రొవోక్ చేసి తన క్రేజ్‌ను రేవంత్ ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. చూడాలి మరి.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందో..రేవంత్ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత శ్రేణుల్లో జోష్ వచ్చినప్పటికీ నియోజకవర్గాల వారీగా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలని వాదించే వారు ఉన్నారు. అయితే, ఈ ప్లానింగ్ కోసం రేవంత్ పార్టీ సీనియర్ నేతలతో సమన్వయపరుచుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు దాదాపు ఫైనల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ, అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news