కాకి తన్నితే చెడు కలుగుతుందా…? ఏది మంచి, ఏది చెడో చూద్దాం..!

-

చాలామంది ఎన్నో మూఢనమ్మకాలని పాటిస్తూ ఉంటారు. పెద్దలు కూడా పిల్లి ఎదురు వస్తే వెళ్ళొద్దని లోపలికి వచ్చి కూర్చొమని చెప్తూ ఉంటారు. అయితే నిజంగా వీటిని నమ్మొచ్చా..? మరి శకున శాస్త్రం దీనికి సంబంధించి ఏం చెబుతోంది అనేది చూద్దాం. కాకి భుజం పై తంతే ఏదో చెడు రాబోతోంది ఆని అంటారు. అలాగే పిల్లి ఎదురు వచ్చినా కూడా చెడు జరుగుతుంది అని అంటూ ఉంటారు. అయితే వీటి గురించి శాస్త్రం కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పింది. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

కాకి కనుక తలపై తన్నితే ప్రాణగండం సంభవించచ్చని పండితులు చెబుతున్నారు. జంతువులు లేదా పక్షులు మనకి శుభం, అశుభం సూచికలను ఇస్తూ ఉంటాయి. వీటి ఆధారంగా కూడా భవిష్యత్తుని తెలుసుకోవచ్చని పండితులు చెప్పారు. ఉదయాన్నే బయటకు వెళ్ళేటప్పుడు తెల్లటి హంస కానీ గుర్రం కానీ నెమలి కానీ చిలుక కానీ ఎదురు వస్తే దానిని శుభసూచకంగా పరిగణించవచ్చు.

అలానే పని కి వెళ్లేటప్పుడు ఆవు దూడ కి పాలు ఇస్తున్నట్టు చూసినా సరే ప్రయాణం విజయవంతంగా అవుతుంది. తెల్లటి ఆవు కనిపించిన కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నప్పుడు పిల్లి ప్రసవిస్తే అది శుభం కింద పరిగణించవచ్చు.

అదే పిల్లి ఏడుపు వినిపిస్తే అది ఆపదకు సంకేతం. ఒకవేళ కనుక పిల్లి ఎదురు వస్తే పని పూర్తి కాదని సంకేతం. కాకి కనుక అరుస్తూ ఉంటే ఎవరైనా ఇంటికి వస్తారని సంకేతం. అదే ఒకవేళ కాకి భుజంపై కానీ తలపై కాకి తన్నితే అది చెడుగా పరిగణించాలని శకున శాస్త్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news