సోషల్ మీడియాలో ఈ మధ్య కాలం ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాట్సాప్, ట్విట్టర్ ఫేస్బుక్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి ఫేక్ వార్త ఏదో ఒకటి మనకి వినబడుతూ ఉంటుంది. చాలా మంది వీటిని నమ్మి నిజమని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇలా సోషల్ మీడియా లో ఫార్వర్డ్ చేసిన వాటిని చూసి అన్నింటినీ నమ్మితే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు వచ్చింది. అయితే ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. జ్ఞానదంతం సర్జరీ చేయడానికి ముందు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే మంచిదని ఈ పోస్ట్ లో ఉంది. అయితే ఇది నిజంగా నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. విశ్వాస్ న్యూస్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం జ్ఞాన దంతం సర్జరీకి ముందు పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం అనేది ఫేక్ వార్త అని ఈ ఫేక్ వార్త విపరీతంగా వైరల్ అవుతోందని తెలుస్తోంది.
అయితే దీనిపై ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. పేషెంట్ రికవరీ అవడానికి పైనాపిల్ జ్యూస్ పని చేస్తుందని ఎటువంటి ప్రూఫ్ లేదు. అయితే ఇన్వెస్టిగేషన్ చేయగా పైనాపిల్ రసం కానీ పైనాపిల్ పండు కానీ ఎలాంటి బెనిఫిట్ ని ఇవ్వలేదని తెలుస్తోంది.
కాబట్టి జ్ఞానదంతం సర్జరీకి ముందు కానీ తర్వాత కానీ పైనాపిల్ జ్యూస్ ని రికమెండ్ చేయొద్దని అంటున్నారు. ఎప్పుడైనా సరే డాక్టర్లు చెప్పినట్టే ఫాలో అవ్వాలి. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పే వాటిని అనుసరిస్తేనే మంచిది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి ఇబ్బందుల్లో పడొద్దు. అలానే తెలిసీ తెలియని వాటిని ఫార్వర్డ్ చేయకండి.