ఆడా, మగా కానీ వాళ్ల ఛాలెంజ్‌ స్వీకరించం ; లోకేష్‌ కు కొడాలి కౌంటర్‌

లోకేష్ సవాలును మేము స్వీకరించలేమని… ఆడా, మగా కానీ వ్యక్తులతో మేము సవాళ్లు స్వీకరించమని నారా లోకేష్‌కు కౌంటర్‌ ఇచ్చారు కొడాలి నాని. జీతమిస్తూ చెప్పినట్లు మాట్లాడే వారితో చంద్రబాబు రెచ్చగొట్టించారని… పంచాయతి నుంచి పార్లమెంట్ వరకు వైకాపా అభ్యర్థులు గెలుస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సహించలేక చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని… ఇలా కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులతో ఉసిగొల్పి తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీ అని మండిపడ్డారు.

సీఎం సహా మాపై ఎవరు తిట్టినా దానికి మూల కారణం చంద్రబాబేనని… మోదీని దింపాలని రాహుల్ తో జట్టుకట్టిన చంద్రబాబు, అమిత్ షాను ఎలా కలుస్తారని చురకలు అంటించారు. చంద్రబాబు,పవన్ ఇద్దరూ స్నేహితులేనని.. తె దేపా పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు. తెదేపా హయాంలో హెరిటేజ్ షాపుల్లో గంజాయి అమ్మారని… గంజాయి అమ్మి వేలకోట్లు సంపాదించారని మండిపడ్డారు. పాలు, పిడకలు అమ్మి ఎవరైనా వేల కోట్లు సంపాదించటం చూశామా? అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక హెరిటేజ్ లో గంజాయి విక్రయాన్ని అనుమతించడం లేదన్నారు. చంద్రబాబు బంద్ కు పిలుపు ఇస్తే రాష్ట్రంలో ఒక్క బడ్డీకొట్టు కూడా మూయలేదని ఎద్దేవా చేశారు కొడాలి నాని.