ఆడపిల్లలకు హక్కులు ఉండవు : మాన్సాస్ ట్రస్ట్ పై అశోక్ గజపతి రాజు సంచలనం !

-

మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ నియామకం, ఆలయ భూముల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు అశోక్ గజపతిరాజు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆడపిల్లకు హక్కులు వస్తాయని కొందరు మంత్రులు కన్ఫ్యూజ్ అయ్యారని.. రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉండరాదని ఈక్వెల్ రైట్స్ అప్పుడు అన్నగారు ఇచ్చారని పెర్కొన్నారు. వాస్తవానికి ట్రస్ట్ విషయం లో ఆడపిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవన్నారు. కానీ ట్రస్ట్ వేరు, ప్రైవేట్ ప్రాపర్టీ వేరు…ట్రస్టు ప్రభుత్వ ఆస్తుల అంటూ కొందరికి కన్ఫ్యూజ్ వస్తుందని.. మాన్సాస్ ట్రస్టు విషయంలో భక్తులు దేవుడికి ఇచ్చినది అవుతుంది.ఇది ప్రభుత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు.

గతంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పిందని.. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ గానే పనిచేస్తుంది కానీ ఓనర్ కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం రోల్ ఏంటి అనేది స్పష్టంగా ఉందని.. రాష్ట్రంలో ఆనవాయితీగా వున్న టెంపుల్స్ 230 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. కావాలంటే వాటికి ప్రభుత్వం ఫౌండర్ మెంబర్స్గా మొత్తం మహిళలకే ఇవ్వొచ్చని.. సింహాచలం దేవస్థానం భూ ములను ఒక పాలసీ ప్రకారం ఇవ్వాలి అనేది తన అభిప్రాయం అన్నారు.

తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్ష లేదని…అందరితో పని చేస్తానని చెప్పారు. ధర్మకర్తగా నాకు అధికారులకు మధ్య భవిష్యత్తులో విభేదాలు రాకూడదని.. మాన్సాస్ ఈవో ను నేను వెళ్ళి కలుస్తాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఆ పెద్దమనిషి నాకు టైమ్ ఇవ్వలేదన్నారు. ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేవి కొంతవరకు తెలిశాయని.. రికార్డులలో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. భక్తులు సౌకర్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి.. దానిపై హోవర్క్ చేసి అన్ని కోణాల నుండి రిపోర్ట్స్ తెప్పించుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news