భట్టికి బ్రేక్ వేయడం కమల్‌కు సాధ్యమేనా….?

-

మల్లు భట్టి విక్రమార్క…తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు….మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న నేత. మొదట పి‌సి‌సి మెంబర్‌గా పని చేసిన భట్టి, ఆ తర్వాత పి‌సి‌సి సెక్రటరీగా పనిచేశారు. ఇక 2007లో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.

రాష్ట్రం విడిపోయాక కూడా భట్టి…అది మధిర నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో మరోసారి మధిర నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఇలా హ్యాట్రిక్ కొట్టిన భట్టి, తెలంగాణ ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఎంపికయ్యారు. ఇక ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినా సరే భట్టి, ఇంకా కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో సైతం తన వాయిస్ వినిపిస్తున్నారు.

ఇలా కాంగ్రెస్ బలమైన నాయకుడుగా ఉన్న భట్టికి చెక్ పెట్టాలని టి‌ఆర్‌ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. రెండుసార్లు భట్టిపై టి‌ఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అయితే ఈ సారి మాత్రం భట్టికి ఛాన్స్ ఇవ్వకూడదని టి‌ఆర్‌ఎస్ నాయకుడు లింగాల కమల్ రాజు ప్రయత్నిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కమల్, టి‌ఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి భట్టిపై ఓడిపోయారు.

ఓడిపోయిన దగ్గర నుంచి మధిరలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అధికారంలో ఉండటం కమల్‌కు బాగా ప్లస్ అవుతుంది. పైగా కే‌సి‌ఆర్…కమల్‌ని ఖమ్మం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ని కూడా చేశారు. దీంతో కమల్ దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా భట్టికి చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే మధిరలో భట్టికి వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఎక్కువ. మరి అలాంటి నాయకుడుకు కమల్ ఎంతవరకు చెక్ పెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version