బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటున్న నెటిజ‌న్లు.. ఆ ప్రోగ్రామ్ చూడాలంట‌..

-

‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. అయితే, ఈ షో వల్ల జనాలకు కలిగే ఉపయోగమేంటి? అని పలువురు అడుగుతున్నారు. టీవీ మందు గంటల తరబడి కూర్చొనడం వల్ల ఎటువంటి విజ్ఞానం లభించకపోగా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పిచ్చి పిచ్చి చేష్టలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వినబడుతోంది.

ఇకపోతే ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్స్, ఏదేని విషయమై రియాక్షన్స్ ద్వారా మానవ సంబంధాలపై ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో ఇచ్చే టాస్కుల ద్వారా కంటెస్టెంట్స్‌లో అభద్రతాభావం ఏర్పడి వారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండటం మనం చూడొచ్చు కూడా. కంటెస్టెంట్స్ డైలాగ్స్ కూడా సొల్లులా అనిపిస్తున్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం షో రన్ అవుతున్నదనే వాదన కూడా వినబడుతోంది. నిజానికి ప్రోగ్రాం ప్రొడ్యూసర్స్ ఈ షోను ప్లాన్ చేసింది టీఆర్పీ రేటింగ్స్ కోసమే అనేది నిర్వివాదాంశం. అయితే, ఈ షోను ఎక్కువ సేపు చూస్తే జనాలు ఇబ్బందుల పాలవుతారనే వాదన వినబడుతోంది. గతంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ ‘బిగ్ బాస్’ షో పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఈ షో ను ఇంటి నుంచి తరిమేయాల్సిన అవసరముందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ షోకు బదులుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాం చూస్తే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version