మ్యూచువల్ ఫండ్స్: మార్కెట్ పడిపోతున్నప్పుడు సిప్ ఆపితే నష్టం వస్తుందా?

-

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఉన్న చాలా సందేహాల్లో ఇది కూడా ఒకటి. మార్కెట్లు పడిపోతుంటే డబ్బులు తీసుకోవాలని చూస్తారు. మార్కెట్లు పెరుగుతుంటే డబ్బులు పెట్టాలని చూస్తారు. ఒకేసారి పెద్ద మొత్తం పెట్టేవాళ్ళు ఇలా ఆలోచించడం సమంజసమే అయ్యుండవచ్చు కానీ, నెల నెలా కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం ఇలా ఆలోచించకూడదు. ఇలా ఆలోచించి నెల నెలా పెట్టే (సిప్) ఆపేస్తే నష్టపోతారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

రిటైర్ మెంట్ ప్లాన్ కోసమో, పిల్లల చదువుల కోసమో, పర్యాటకం కోసమో నెల నెలా కొద్ది మొత్తంలో డబ్బు సేవ్ చేయడం అలవాటు చేసుకున్నవాళ్ళు, మార్కెట్లు పడిపోతుంటే బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా, పడుతూ లేస్తూ ఉంటుంది. ఇప్పుడు పడిందని సిప్ ఆపేసి, పెరుగుతున్నప్పుడు స్టార్ట్ చేయడమనేది అర్థం లేని వ్యవహారం. ఎందుకంటే అదెప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తరుగుతుందో తెలియదు.

అదీగాక మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఆపకుండా ఉంటే మన పెట్టుబడికి రావల్సిన యూనిట్లు ఎక్కువగా వస్తాయి. చవగ్గా వచ్చిన యూనిట్ల విలువ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల లాభమే. ఉదాహరణకి, కిలో టమాట 5రూపాయలనుకుందాం. 10రూపాయలకి రెండు కిలోలు కొన్నాం. అదే టమాట ధర తగ్గి, 10రూపాయలకి మూడు కిలోల టమాటలు వచ్చాయి. ఈ మూడు కిలోల టమాటలకి టమాట రేటు పెరిగినపుడు 15రూపాయలు వచ్చాయనుకుంటే లాభమే కదా..

మ్యూచువల్ ఫండ్లలో యూనిట్ల విలువ కూడా అంతే ఉంటుంది. అందుకే మార్కెట్లు పడిపోతున్నప్పుడు సిప్ ఆపకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకి అనుగుణంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు సరిగ్గా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news