ఖాళీగానే ఉన్నం కదా కాను కారు వెనుక సీటులో కుర్చోని నిద్రపోతున్నారా..? ప్రాణాలకే ప్రమాదం

-

జర్నీ చేసేప్పుడు మనకు బాగా నిద్రవస్తుంది. అదేంటో ఇంట్లో ఎంత ఖాళీగా ఉన్న నిద్రపట్టదు.. కానీ జర్నీ స్టాట్‌ చేస్తే చాలు.. అది ట్రైన్‌ అయినా, బస్సు అయినా, కారు అయినా వెంటనే నిద్రపడుతుంది. ఇక కారులో అయితే మనదే కాబట్టి చాలా మంది హ్యాపీగా పడుకుంటారు. కారులో ఏసీ వేసుకుని పడుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదమని మీకు తెలుసా..? అవునట.. కారులో నిద్రపోకూడదని నిపుణులు అంటున్నారు.

దూర ప్రయాణాలు చేసినప్పుడు ఎయిర్ కండీషనర్‌ను ఆన్‌లో ఉంచుతారు. సుదూర ప్రయాణాల్లో డ్రైవర్ కారు నడుపుతాడు. వెనుక కూర్చున్న వారు మాత్రం నిద్రపోతుంటారు. కారులోని ఇంజిన్ కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు పేరుకుపోతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఊపిరాడక మరణానికి కూడా దారితీస్తుంది. నిద్రలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.

AC ఆన్‌లో ఉన్న కారుతో కలిగే అతిపెద్ద సమస్య తాజా ఆక్సిజన్‌ ఉండదు. కారులో ఉన్నవాళ్లు ఫ్రెష్‌ ఆక్సిజన్‌ పీల్చుకోలేరు. కార్బన్ డయాక్సైడ్ రీసైకిల్ చేసి తిరుగుతుంది. మీకు తెలిసే ఉంటుందిగా..కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైనదని. ఇది తరచుగా కార్లలో నిద్రిస్తున్న వ్యక్తుల మరణానికి కారణం అవుతుంది. కారు స్విచ్ ఆఫ్ అయినప్పుడు మీ క్యాబిన్‌లో పెద్ద మొత్తంలో పేరుకుపోతుంది. కారులో ఉన్నవాళ్లకు కార్బన్ మోనాక్సైడ్ పీల్చుతున్నట్లు కూడా తెలియదు. శ్వాస సమయంలో ఎంత విషాన్ని పీల్చుతున్నారో కూడా మీరు గ్రహించలేరు.

కారులో నిద్రిస్తున్నప్పుడు కారులో ఎయిర్ కండీషనర్ సరిగా పనిచేయకపోవడం కూడా మరణాలకు ప్రధాన కారణం అవుతుంది. కారులోని ఏసీ సరిగా పని చేయకుంటే, అది లోపల ఉన్న గాలిని పూర్తిగా రిఫ్రెష్ చేయదు. ఇది కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా ఈ కార్బన్ మోనాక్సైడ్ కారులో నిద్రిస్తున్న వ్యక్తి మరణానికి కారణం అవుతుంది.

కార్బన్ మోనాక్సైడ్ మీ కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే రక్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోతారు. కారు విండోస్‌ తెరిచి ఉంచడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ చేరడం నిరోధించవచ్చని కొందరు అంటున్నారు. కానీ ఇది పాక్షికంగా మాత్రమే సహాయపడుతుంది. డ్రైవర్లు ఎక్కువసేపు కారులో పడుకోకుండా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

డ్రైవర్‌లు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కారులో నిద్రించాలి. ఇకలో కారులో డ్రైవర్‌తో పాటు వెళ్లే వాళ్లు అయితే అసలు నిద్రపోకూడదు. ఎప్పుడూ కిటికీ మూసి ఉంచి డ్రైవ్ చేయవద్దు. ప్రత్యేకించి ఎక్కువ దూరం వెళ్తున్నప్పుడు ఏసీని చెక్ చేస్తూ ఉండాలి.. మీ కారులో ఫోల్డ్ చేసే.. టేబుల్ పెట్టుకోవాలి. లాంగ్‌ జర్నీల్లో దానిని బయట ఉంచి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version