లోదుస్తుల్లో బంగారం.. హైదరాబాద్ ఎయిర్​పోర్టులో నిందితుడి అరెస్టు

-

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో తరచూ విదేశీ కరెన్సీ, బంగారం పట్టుబడుతున్నాయి. ఇటీవలే పలువురు ప్రయాణికుల నుంచి రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మరవకముందే అధికారుల తనిఖీల్లో మరోసారి భారీగా బంగారం బయటపడింది.

కస్టమ్స్‌, డీఆర్ఐ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ ఈకే 528 విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 823 గ్రాముల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు.

ముందస్తు సమాచారంతో తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ప్రయాణికుడు తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్లినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version