హస్తం గూటికే మైనంపల్లి..కానీ ట్విస్ట్ అదే.!

-

బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత మైనంపళ్లి హనుమంతరావు కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి రెడీ అయ్యారా? సెప్టెంబర్ 17న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొనున్న సభలో మైనంపల్లి కాంగ్రెస్ లో చేరనున్నారా? పోలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం..మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు బి‌జే‌పి నుంచి సస్పెండ్ అయిన యెన్నం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ వైపు వస్తున్నట్లు తెలిసింది.

అయితే ఇక్కడ బి‌ఆర్‌ఎస్ లో సీటు ఫిక్స్ అయిన మైనంపల్లి కాంగ్రెస్ లోకి వస్తున్నారా? అనేది పెద్ద చర్చ. ఎలాగో తుమ్మలకు సీటు దక్కలేదు కాబట్టి..ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. కానీ మల్కాజిగిరి సీటు మైనంపల్లికి కే‌సి‌ఆర్ ఫిక్స్ చేశారు. కాకపోతే ఆయన..హరీష్ రావుని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ సీటు అడిగిన విషయం తెలిసిందే. ఇక హరీష్ పై విమర్శలు చేయడంతో మైనంపల్లిపై కే‌సి‌ఆర్ గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ ఇంతవరకు సీటు క్యాన్సిల్ చేయలేదు. దీంతో మైనంపల్లిని బి‌ఆర్‌ఎస్ లో కొనసాగించాలని చూస్తున్నారా? అనే డౌట్ ఉంది. కాకపోతే మైనంపల్లి మాత్రం పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా రాజకీయం చేసుకుంటున్నారు. అలాగే తన తనయుడు సీటు కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాని తనతో పాటు, తన తనయుడుకు సీటు ఇస్తే అందులో చేరడానికి రెడీ అవుతారని తెలుస్తోంది.

కానీ ఇద్దరికి సీట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఇటు మల్కాజిగిరి, అటు మెదక్ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కొందరు కీలక నేత దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని కాదని మైనంపల్లికి సీట్లు ఇవ్వడం అనేది కష్టమైన టాస్క్. చూడాలి మరి మైనంపల్లి రాజకీయ పయనం ఎటు వైపు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news