మన దేశానికి ముప్పు పొంచి ఉందా.. ??

-

అసలు ప్రపంచం మొత్తంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏదో ముప్పు ముంచుకొస్తుందని అనిపిస్తుంది.. ఎందుకంటే ఒక వైపు కరోనా దాదాపుగా అన్ని దేశాలను వణికిస్తుంటే, మరో వైపు చైనా, పాకిస్దాన్‌ల కవ్వింపు చర్యలు.. మరో వైపు మనదేశం పై చైనా ప్రవర్తిస్తున్న తీరు ఏ ప్రమాదానికి దారి తీస్తుందో తెలియడం లేదు.. ఇలాంటి పరిస్దితుల్లో మిగతా దేశాల సంగతి ఏంటో గానీ మన దేశంకు మాత్రం ఎన్నో పెద్ద చిక్కులు వచ్చిపడుతున్నాయి.. అందులో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి.

ఇక తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌కు ఈశాన్య భాగంలో 125 కి.మీ. దూరంలో సోమవారం అంటే ఈరోజు రాత్రి 7.46 గంటలకు భూమి కంపించింది. దీంతో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇది గాక ఈ రోజు వేకువజామున 4:10 గంటలకు మిజోరంలో భూకంపం సంభవించగా, దీని తీవ్రతకు ఛంపాయ్ జిల్లాలో దాదాపు 27 కిలోమీట‌ర్ల లోతు వ‌ర‌కు భూమి కంపించిన‌ట్లు వెల్లడించింది.

 

ఇకపోతే ఈ భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు నేలమట్టమవగా, రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయట. ఇక ఈ మధ్య కాలంలో వరుసగా ఢిల్లీలో భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.. కాగా నెటిజన్లు 2020 ఎంత భయంకరమైందని ట్వీట్ చేశారు.. ఇక కరోనా వైరస్‌తో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. భూకంపాలతో ఇంట్లో ఉండలేని పరిస్థితి తలెత్తుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి మన దేశానికి ఏం ముప్పు పొంచి ఉందో అని బెంగ కూడా పడుతున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news