బిగ్ బ్రేకింగ్ : కరోనా కేసుల్లో తెలంగాణ రికార్డ్.. ఒక్క రోజులోనే..!

-

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,674కి పెరిగింది. తాజాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 4,005 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరో 7గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 217కి చేరింది.  కాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 713 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అటు రంగారెడ్డి జిల్లాలోనూ ఇవాళ 107 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news