ఇస్రో: చంద్రయాన్ – 3 ప్రయోగానికి ప్రధాని మోదీ ?

-

ఇస్రో ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అంతరిక్షముపై ప్రపంచంలో ఏ దేశ శాస్త్రవేత్తలు చేయనన్ని ప్రయోగాలు మన ఇండియా చేసి చూపించింది. ఎన్నో అద్భుతాలను సృష్టించి ప్రపంచ దేశాలే అబ్బురపడేలా చేసింది. ఇక తాజాగా చంద్రయాన్ పేరుతో మరో రాకెట్ ను అంతరిక్షము లోకి పంపించడానికి ఇస్రో సిద్ధంగా ఉంది. మరో నాలుగు రోజుల్లో ఇస్రో సంస్థ చంద్రయాన్ 3 అన్న పేరుతో ప్రయోగం చేయనుంది. దీని కోసం భారతదేశం అంతటా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇక తాజాగా ఇస్రో చైర్మన్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ ప్రయోగాన్ని స్వయంగా దగ్గరుండి వీక్షించడానికి చాలామంది ప్రముఖులు వస్తున్నారని తెలిపారు. ఇక మీడియా యాంకర్ అయితే ప్రధాని మోడీ కూడా వస్తారా అని ప్రశ్నించగా.. ఈ శుభ సందర్భమున అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము..

అయితే మోదీ వస్తారా రారా అన్నది మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చూసుకుంటుంది అంటూ తెలివిగా సమాధానము ఇచ్చారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ప్రయోగించిన చంద్రయాన్ 2 ను ల్యాండింగ్ అప్రోచ్ ను మోదీ చూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version