అవసరాల శ్రీనివాస్ కి నిజంగా బట్టతలేనా..? సినిమా ప్రమోషన్లో భాగంగా అలా చేసారా?

-

నిన్నటికి నిన్న అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపడిందంటూ ఒక వీడియో బయటకి వచ్చింది. అందులో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపించాడు. ఆ వీడియో తీస్తున్న కో డైరెక్టర్ మహేష్ పై అవసరాల విరుచుకుపడడం, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని చెప్పడం, దానికి అన్ని సోషల్ మీడీయా అకౌంట్లలో పెట్టేస్తానని చెప్పడం జరిగింది. ఇదంతా చూసిన జనాలు అవసరాల శ్రీనివాస్ ఇలాంటివాడా? ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలు తీసింది ఈ డైరెక్టరేనా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు.

ఐతే ఇదంతా నిజమేనా కాదా అన్న సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. ఏదో విషయం మీద ఆఫీసుకు వెళ్తే చెడామడా తిట్టాడని చెప్పి, ఇలా చేసాడా లేదా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విధంగా పబ్లిసిటీ కోరుతున్నారని అనేది అనుమానంగా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, హిందీలో హిట్ అయిన బాలా అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, అందుకే అవసరాల శ్రీనివాస్ అలా బట్టతల ఉన్నట్టు కనిపించాడని అనేవాళ్ళు ఉన్నారు. మరి ఏది నిజమో ఏది కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version