పరిటాల రవి హత్య లో RS ప్రవీణ్ కుమార్ ఫెయిల్ అయ్యాడా ?

-

తెలంగాణ ఎన్నికలలో ప్రవీణ్ కుమార్ గురించి చాలా ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల ఒక టీవీ డిబేట్ లో భాగంగా ప్రవీణ్ కుమార్ కు ఆసక్తికర ప్రశ్నను అడిగారు. పొలిటికల్ లీడర్ పరిటాల రవి హత్య పై అప్పుడు అనంతపురం ఎస్పీ గా ఉన్న RS ప్రవీణ్ కుమార్ ఫెయిల్ అవ్వలేదా అంటూ సంధించిన ప్రశ్నకు… ప్రవీణ్ కుమార్ సమాధానం ఇస్తూ పరిటాల రవిని అప్పట్లో చంపడానికి ప్రణాళికలు జైల్లోనే చేస్తున్నారని తెలుసుకుని వెంటనే అప్పుడు డీజీపీ కి రిపోర్ట్ ఇచ్చాను అని ప్రవీణ్ కుమార్ తెలియచేశాడు. కానీ పై అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం మా పొరపాటు లేదా వైఫల్యం ఎలా అవుతుంది అంటూ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ వైఫల్యం లేదని డిబేట్ లో ఉన్నవారు అంతా తెలుసుకున్నారు. ఈ విధంగా నిజాయితీగా మరియు దైర్యంగా ఉన్నాడు కాబట్టే ప్రజలలో ప్రవీణ్ కుమార్ కు ఆదరణ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news