నాగచైతన్య సోదరుడు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం అదేనా..?

-

అక్కినేని నాగచైతన్య సోదరుడు అనగానే అందరికీ అక్కినేని అఖిల్ గుర్తొస్తాడు. కానీ అక్కినేని నాగచైతన్యకు మరొక తమ్ముడు కూడా ఉన్నాడనే విషయం బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పలుకుబడి ఉంది. కానీ ఆయన వారసుడు నాగార్జున మాత్రం తండ్రి పలుకుబడిని ఉపయోగించుకోకుండా స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున మాత్రమే కాదు ఆయన ఇద్దరు కొడుకులైనా నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలో తమ వంతు స్టార్ డంను సొంతం చేసుకున్నారు. ఇక నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశాడు. ఇక ఆయన ఇటీవల సీతారామం సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక సుమంత్ మాత్రమే కాకుండా నాగార్జున మరొక మేనల్లుడు సుశాంత్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఈయన నటించిన మా నీళ్ల ట్యాంకు వెబ్ సిరీస్ కూడా ఒకరకంగా మెప్పించింది. ఇక ఇప్పుడు ఏఎన్ఆర్ కి నాగార్జున కాకుండా మరొక కొడుకు ఉన్నాడు అన్న విషయం చాలామందికి తెలియదు. ఏఎన్ఆర్ పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ నటుడిగా కాకుండా నిర్మాతగా కొనసాగుతున్నారు. అక్కినేని వెంకట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈయన కొడుకు పెద్దవాడయ్యాడు. అతని పేరే ఆదిత్య.. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా మీడియా కంటే పడలేదు.

చూడడానికి అచ్చం నాగచైతన్య లాగే ఉంటాడు . ఇక ఆదిత్య కు సినిమాల కంటే కార్లు అంటే ఇష్టమట . కార్ రేసర్ గా తన లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . అందుకే ఇంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఇక నాగచైతన్య కి కూడా కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news