లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని రేసులో ఉన్నారా అని కేజీవాల్ను ప్రశ్నించగా.. తాను లేనని బదులిచ్చారు. కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఆప్ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో ఆయనను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఇన్నాళ్లు తిహార్ జైలులో ఉన్నారు. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కి కొన్ని షరతులు విధించింది.