తెలంగాణలోని పలు జిల్లాల్లో సా. 7 గంటల్లోపు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది. ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనున్నట్లు వెల్లడించింది.
అయితే హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో జిహెచ్ఎంసి ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.