సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇప్పటికే మంచి వసూళ్లను సినిమా రాబడుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సత్తా చూపెడుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో ని రిలీజ్ చేశారు యాంకర్ సుమ మహేష్ బాబు శ్రీ లీల ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు డాన్స్ కి ప్రశంసలు దక్కాయి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుండి నేను త్రివిక్రమ్ ఒకటే అనుకున్నాం రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేయాలని ఫిక్స్ అయిపోయామని అన్నారు. ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా సినిమా పాటలు చేస్తామో లేదో తెలియదు ఇది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అని మళ్లీ జాగ్రత్తపడి డాన్స్ల విషయంలో చేయగలిగిన చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అని కవర్ చేసేసారు మహేష్ బాబు. మళ్లీ మూడేళ్ల తర్వాత నా ఇంటర్వ్యూ ఇచ్చేది అని సుమ అంటే మహేష్ బాబు మాట్లాడుతూ అలా ఏమీ కాదు రెగ్యులర్గా ఇటువంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయే రావు తెలియదు అని మహేష్ బాబు అన్నారు