విశ్వక్ సేన్ ఆ హీరోయిన్ ప్రేమలో ఉన్నాడా..?

-

ఇండస్ట్రీ లోకి వచ్చి ఒకటి రెండు సినిమాలను తెరకెక్కించి వాటి ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. మాస్ కా దాస్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తమిళ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడా అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పాగల్ సినిమాలో నటించిన నివేదా పేతురాజు మళ్ళీ అతని డైరెక్షన్లో వస్తున్న దాస్ కా ధమ్కీ సినిమాలో కూడా నటించింది.. ఇక ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేలా ఉందంటూ చూసినవారు అంటున్నారు. ఇక విశ్వక్ సేన్ ప్రేమలో పడ్డాడు అంటూ ఫిలింనగర్లో వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ధమ్కీ సినిమాలో విశ్వక్ సేన్ తో నివేదా పేతురాజు రొమాన్స్ చూస్తే అందరికీ ఆ డౌట్ తప్పకుండా వస్తుంది. ఈ సినిమాని విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా ఆయనే వ్యవహరించారు. తమిళ సినిమాలలో రాణిస్తూ వచ్చిన నివేదా పేతురాజు తెలుగులో మెంటల్ మదిలో అనే సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించింది. చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న ఈమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తను నటించిన ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయకుండా వచ్చిన నివేదా ధమ్కీ సినిమాలో మాత్రం విశ్వక్ కోసం ఆ హద్దులు కూడా దాటేసింది.

విశ్వక్ సేన్ మీద ఉన్న ఇష్టంతోనే అలా చేసిందని అంటున్నారు. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారా లేక ఇవి రూమర్స్ ఆ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇంకొన్ని రోజులు ఆగితే తప్ప విశ్వక్ సేన్, నివేదా పేతురాజు ప్రేమలో ఉన్నారా ? లేదా? అనేది స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news