సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్న ఇషాన్ కిషన్ వరుస హాఫ్ సెంచరీలు … !

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్ డే ల సిరీస్ లో రెండవ వన్ డే బార్బడాస్ వేదికగా జరుగుతోంది. టాస్ ఓడిన ఇండియా మొదటగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ ను కోనసాగిస్తూ వరుసగా రెండవ అర్ధ సెంచరీ ని సాధించాడు. మొదటి మ్యాచ్ లో ఇదే విధంగా పరుగులు లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఇషాన్ 46 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ద సెంచరీ సాధించాడు. కాగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లోనూ ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎక్కడా తొండరపడకుండా ఆచితూచి ఆడుతూ ఇండియాకు మెరుగైన స్కోర్ ను అందించే బాధ్యతను తీసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ 52 బంతుల్లో 5 ఫోర్లు మరియు సిక్సు సహాయంతో 51 పరుగులు చేశాడు.

కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడే ఇండియా తన మొదటి వికెట్ ను గిల్ (34) రూపంలో కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news