కలలను కంట్రోల్‌ చేద్దామని తలకు రంధ్రం పెట్టుకున్న సైంటిస్టు.. సీన్‌ కట్‌ చేస్తే

-

కలలను ఎవరూ కంట్రోల్‌ చేయలేరు. నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్‌ పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది. అందులో భాగంగా మనకు ఏవేవో కలలు వస్తాయి. ఒకసారి కల మధ్యలో ఉన్నప్పుడు మేల్కుంటే మళ్లీ అదే కల రాదు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా కొన్నిసార్లు కలలు గుర్తుండవు.. కానీ ఇక్కడ పిచ్చి పలురకాలు అన్నట్లు.. ఓ సైంటిస్టూ అతి తెలివితో.. కలలను కంట్రోల్‌ చేద్దామాని బుర్రకు బొక్కెట్టేసుకున్నాడు.

న్యూరో సైన్స్ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ.. ఇప్పటికీ మనుషులు ఎందుకు? ఎలా కలలు కంటున్నారు అనే దాని గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. వాటిపైనే పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్త మిఖాయిల్ రాదుగా. ఇతను రష్యాకు చెందిన సైంటిస్ట్. ఎప్పుడూ పరిశోధనలోనే మునిగితేలుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తన పైన తానే ప్రయోగం చేసుకున్నాడు. దానికి తగిన మూల్యాన్ని చెల్లించాడు. ఇంట్లోనే తన పుర్రెకు తానే చిల్లు పెట్టుకొని.. లోపల ఒక చిప్‌ను పంపించాలనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. ఆసుపత్రి పాలయ్యాడు.

మిఖాయిల్ రాదుగా తన మెదడులో ‘డ్రీమ్ కంట్రోలింగ్ చిప్’ ప్రవేశపెట్టడం ద్వారా తన స్పష్టమైన కలలను నియంత్రించాలనుకున్నాడు. ఈ ప్రయోగం వేరే వారి మీద చేస్తే.. వారికి ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా.. అందుకే తన కలలను తానే నియంత్రించడానికి తన మెదడులోనే చిప్‌నే పెట్టుకోవాలని అనుకున్నాడు. తన అపార్ట్మెంట్లోనే స్వయంగా శస్త్ర చికిత్స చేశాడు. నాలుగు గంటల పాటు కష్టపడ్డాడు. దీనికి కొంతమంది సాయాన్ని కూడా తీసుకున్నాడు. అతని పుర్రెను డ్రిల్ చేసి రంధ్రం పెట్టి దానిలో చిప్‌ను పంపించి తిరిగి పుర్రెను తిరిగి మూసేయాలి అన్నది ఆయన ప్లాన్. కానీ ఈ ప్రక్రియలో ఆ సైంటిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు గంటల శస్త్ర చికిత్స తర్వాత ఒక లీటర్ రక్తాన్ని కోల్పోయాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

వైద్యులు అతి కష్టం మీద ఆయన ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇలాంటి తీట పనులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోలుకున్న తర్వాత మిఖాయిల్ తన ట్విట్టర్ ఖాతాలో దీని గురించి పోస్ట్ పెట్టాడు. అతను శరీరానికి వెలుపల జరిగే అనుభవాలు, జ్యోతిష్య అంచనాలు, స్పష్టమైన కలలు వంటి వాటిని చేధించే ‘డిసోసియేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్’ గురించి పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పాడు. నిపుణుల సమక్షంలో ఈ డ్రిల్లింగ్ పనిచేస్తే సమస్య పెరుగుతుందని, స్వయంగా తానే నిర్వహించాలని అనుకున్నాడట. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని మిఖాయిల్‌ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు.!

 

View this post on Instagram

 

A post shared by Michael Raduga (@michael_raduga)

Read more RELATED
Recommended to you

Latest news