ఇస్మార్ట్ శంకర్ హిందీ రీమేక్.. హీరో ఎవరో తెలుసా..?

-

ఈ మధ్య కాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా ను కబీర్ సింగ్ అనే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించ గా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మంచి విజయాలు అందుకున్న జెర్సీ, అలా వైకుంఠపురం లో లాంటి సినిమాలను కూడా బాలీవుడ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ సినిమా కూడా హిందీ రీమేక్ లిస్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ ప్యాక్డ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాలీవుడ్ లో కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news