గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 73 మంది మృతి

-

గాజా పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర గాజా పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడులలో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. మృతి చెందిన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉండడం గమనార్హం. ఈ దాడుల్లో పలువురు గాయపడగా.. కొంతమంది ఆచూకి కూడా కనిపించడంలేదని అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా ఇజ్రాయిల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామాగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు వైద్యాధికారులు ఆరోపించారు. ఉత్తర గాజాలోని ఆసుపత్రుల్లో వైద్య సామాగ్రి మానవ వనరుల కొరత అధికంగా ఉందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవల ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే దక్షిణ గాజా పై  ఇజ్రాయిల్ విమానాలతో కరపత్రాలను విసురుతున్నట్టు సమాచారం. ఆ కరపత్రాల్లో సిన్వర్  మృతదేహానికి సంబంధించిన ఫోటోతోపాటు.. హమాస్ ఇకపై  గాజాను పాలించదు.. ఆయుధాలను వదిలి బందీలను అప్పగించే వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తామని సందేశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news