ఆదోనిలో ఎమ్మెల్యే డా.పార్థసారథి అనుచరుడు భూకబ్జా వ్యవహారం తెరపైకి వచ్చింది. కర్నూలు ఆధోనిలో ఎమ్మెల్యే డా.పార్థసారథి అనుచరుడు భూకబ్జా చేశాడట. ఇతరుల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడట ఎమ్మెల్యే అనుచరుడు డెంటల్ డాక్టర్ రవికిరణ్. ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి బంధువుకు రిజిస్ట్రేషన్ చేయించాడట డా. రవికిరణ్.

SKD కాలనీలో 379B, 380A సర్వే నెంబర్ లో కోట్లు విలవ చేసే ప్లాట్ నే ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి బంధువుకు రిజిస్ట్రేషన్ చేయించాడట డా. రవికిరణ్. 1984 లో కురువ హనుమంతమ్మ పై రిజిస్టర్ అయిన 6 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేశారట. రవికిరణ్ తల్లి పేరు జయలక్ష్మి కాగా హనుమంతమ్మ గా నకిలీ ఆధార్ కార్డు సృష్టించాడట రవికిరణ్. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని సబ్ రిజిస్ట్రార్ కు బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు చేయడం తో ఈ సంఘటన తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు.